ప్రతి పేదవారికి సొంత ఇల్లు మా ధ్యేయం : సీఎం జగన్‌

AP CM YS Jagan Mohan Reddy launches Jagannanna Smart Township Website Today, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan Mohan Reddy launches Jagannanna Smart Township Website, Jagannanna Smart Township, Andhra Pradesh CM YS Jagan, CM YS Jagan, CM YS Jagan Mohan Reddy, Smart Township Website, Jagannanna Smart Township Website, AP, AP News, AP Live Updates, Jagananna Smart Town Scheme 2022, Jagananna Smart Town Scheme, Jagananna Smart Town Scheme News, Jagananna Smart Town Scheme Live Updates, Jagananna Smart Town Scheme Latest News, Mango News, Mango News Telugu, Jagan Mohan Reddy, Jagannanna Smart Township Website Launch,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్’ పథకానికి ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్ కు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా నేడు ప్రారంభించారు. ఈ స్మార్ట్‌ టౌన్‌షిప్ లలో.. మొత్తం లే అవుట్‌లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్ మొదలైన విధంగా రూపొందిస్తున్నారు.

అలాగే, తాగునీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నారు. పూర్తి పర్యావరణ హితంగా.. పార్కులు, ఆట స్థలాలు, ఆరోగ్య కేంద్రం, బ్యాంకులు వంటి వాటికోసం ప్రత్యేక స్థలాలు కేటాయిస్తున్నారు. మొదటి విడతలో 3,894 ప్లాట్లను అన్ని వసతులతో సిద్ధం చేశారు. అన్ని అనుమతులు, వసతులతో 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు. రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని, అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 2 =