పొత్తులో భాగంగా జనసేన అధినేత కేవలం 24 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకోవడం సాక్షాత్తూ జనసేన వర్గానికే నచ్చలేదు. అదేంటి సగానికి సగం సీట్లు కూడా లేకుండా 24 స్థానాలతో సరిపెట్టుకోవడం ఏంటంటూ కొంతమంది ప్రశ్నించారు. 40 సీట్లు కూడా లేకుండా బరిలోకి దిగడం ఏంటని..పవన్ చంద్రబాబు ముందు లొంగిపోయాడని అధికారపక్ష నేతలు సెటైర్లు వేశారు.
వీరందరికి పవన్ చెప్పిన ఒక్క సమాధానం.. ఎన్నికలలో గెలవాలంటే ఆర్ధికంగా బలమైన నేతలు కావాలి కానీ జనసేన అంత ఖర్చుపెట్టే స్థాయిన్న పార్టీ కాదు. పోటీలో నిలబడిన వాళ్లను కచ్చితంగా గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉందా అంటే అదీ లేదు. ముందుకు తీసుకువెళ్లేవారి కంటే వెనక్కి లాగేవాళ్లే ఎక్కవు. అందుకే ఈ 24 సీట్లలో అయినా కచ్చితంగా గెలిపించుకుంటామని..కాదు గెలిపించుకోవాలని అభ్యర్ధులను, జనసైనికులకు ఆయన పిలుపునిచ్చారు. నిజమే పవన్ చెప్పినవి కాస్త కఠినంగా ఉన్నా.. వాస్తవం అదే అన్న వాళ్లూ ఉన్నారు.
రాబోయే ఎన్నికలలో 24 స్థానాలలో జనసేన సులువుగా కనీసం 20 స్థానాలలో అయినా విజయం సాధిస్తుందని పవన్‌తో పాటు జనసైనికులు నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే జనసేన పోటీ చేసే 5 స్థానాలను పవన్ ప్రకటించారు. ఈరోజో, రేపో మిగిలిన స్థానాలను పవన్ ప్రకటిస్తే బాగుంటుందని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్, జనసైనికులు ఫీలవుతున్నారు. అభ్యర్ధులను ప్రకటించగానే జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో.. పవన్ కళ్యాణ్ పర్యటిస్తే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్ధులకు బూస్టప్ ఇచ్చినట్టు అవుతుందని జనసేన కేడర్ ప్లాన్ చేస్తోంది.
నిజానికి 2024 ఎన్నికలు జనసేన పార్టీకి ఎంతో కీలకం. గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా పవన్ కళ్యాన్ వదులుకోకూడదని… ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ ముఖ్యమే కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రచారం విషయంలో వేగం పెంచాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు నేతలకు పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తే జనసేన పార్టీకి గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని ఇటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసే స్థానాలపై కూడా తొందరగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పవన్ ఎమ్మెల్యేగానూ, ఎంపీగా కూడా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా.. ఆ ప్రచారంలో నిజానిజాలు మాత్రం పవన్ రెండో జాబితాలో తెలుస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ







































