కొడుకును ఎమ్మెల్యే చేయాలన్న తండ్రి కల అంతేనా?

MLA Bhumana, MLA,Bhumana Karunakar Reddy, Bhumana Abhinay Reddy, Jagan, TTD, EC, Elections,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu, Mango News
MLA Bhumana, MLA,Bhumana Karunakar Reddy, Bhumana Abhinay Reddy, Jagan, TTD, EC, Elections

అధికారం చేతిలో ఉందని అడ్డుగోలుగా అవినీతి పనులు చేస్తే ఎప్పుడో ఒక చోట అడ్డంగా బుక్ అవక తప్పదు. ఇప్పుడు అచ్చంగా వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి అలాంటి పరిస్థితే వచ్చింది.   2024లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయించి.. తన కొడుకు అభినయ్ రెడ్డిని.. ఎమ్మెల్యేను చేయాలని అనుకోవడమే కాకుండా.. టీటీడీ సొమ్మును ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్న భూమనకి త్వరలోనే గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడిపై  అతి త్వరలో అనర్హతా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిషేధించే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కారణం ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల సమయంలో జరిగిన దొంగ ఓట్ల స్కామే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తిరుపతిలో ఆ మధ్య జరిగిన లోక్ సభ బై ఎలక్షన్స్ సమయంలో రిటర్నింగ్ అధికారులను ఏమార్చి .. ఏకంగా వారి పేర్లతోనే  30వేల ఓటర్ కార్డులను డౌన్ లోడ్ చేసి.. వాటి ద్వారా ఫేక్ ఓటర్ ఐడీలను సృష్టించారు.  ఈ కుంభకోణంపై ఎన్నికల కమిషన్   సీరియస్‌గా దర్యాప్తు సాగిస్తోంది . ఇప్పటికే ఓ ఐపీఎస్‌తో పాటు కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేసింది. ఈ కేసులో పాత్రధారులు కాదు.. సూత్రధారుల్ని గుర్తించాలన్న లక్ష్యంతో ఈసీ విచారణ జరుపుతోంది. దీంతో  ఏ వన్ గా భూమన  కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. మొత్తంగా అభినయ్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా   జరిగినట్లుగా.. పోలీసులకు సాక్ష్యాలు కూడా దొరికినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో.. పోలీసులు కాస్త నెమ్మదిగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికల కోడ్ వస్తుందో అప్పుడు ఒక్క సారిగా దూకుడు పెంచడానికి ఈసీ అధికారులు వెయిట్ చేస్తున్నారు. ఇది ఈసీకి చెందిన కేసు కాబట్టి… త్వరలోనే పూర్తి వివరాలు బయట పెడతారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే అతి త్వరలో ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న భూమన అభినయ్ రెడ్డిని ..అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అభినయ్ రెడ్డిపై అనర్హతా చర్యలు తీసుకునే అంశాన్ని కూడా కొట్టి పారేయలేమన్న ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే భూమన తన కొడుకు గురించి కన్న కలలు కల్లలుగా మిగిలిపోవాల్సిందే మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 17 =