ఏపీలోనైనా బీజేపీ బీసీ సీఎం నినాదం వర్కౌట్ అవుతుందా..?

Will the Slogan of BJP BC CM Work Out in AP, BJP BC CM Slogan Work Out in AP, BJP BC CM Slogan, BC CM Slogan AP, Slogan of BJP, BJP, BJP BC CM, AP Assembly Elections, Andhrapradesh, Latest BJP BC CM Slogan News, Latest BJP News AP, Ap BJP, Modi, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
BJP, BJP BC CM, AP Assembly elections, Andhrapradesh

తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం అనేక వ్యూహాలు రచించింది భారతీయ జనతా పార్టీ. బీసీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం సంచలన ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. ఇదే నినాదంతో ముందుకెళ్లింది. కానీ చివరికి బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. సరిగ్గా ఎన్నికల ముంగిట బీసీ నేత బండి సంజయ్‌ను హైకమాండ్ అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్‌గా నియమించింది. ఆ తర్వాత బీసీ నినాదంతో ముందుకెళ్లడంతో జనాలు నమ్మలేని పరిస్థితి ఎదురయింది.

ఇక త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే తెలంగాణలో వర్కౌట్ కాని అదే నినాదంతో ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం నినాదం అట్టర్ ప్లాఫ్ అయింది. ఊహించినంతగా బీసీలను ఆకట్టుకోలేకపోయింది. తిరిగి అదే నినాదంతో బీజేపీ ఏపీలో ఎన్నికలకు వెళ్లాలనుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విశాఖపట్నంలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందట. ఈనెల 7న ఈ సభ జరగనుందట. ఈ సందర్భంగా తాము అధికారంలోకి వస్తే బీసీనీ ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించనుందట. అలాగే బీసీలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న.. అలాగే తాము అధికారంలోకి వస్తే అందించబోయే పథకాల గురించి సభలో ప్రకటించనున్నారట. ఈ సభకు ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు కూడా వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఏపీలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఉత్కంఠకరంగా మారుతోంది. తమతో పొత్తు కూడాలని ముందు నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీని ఆహ్వానిస్తున్నాయి. అటు వైసీపీతో బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈక్రమంలో పొత్తు గురించి బీజేపీ ముఖ్యనేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తరుణ్ చుగ్ విజయవాడ వెళ్లారు. ఈరోజు ముఖ్యనేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ముఖ్యనేతల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బీజేపీ హైకమాండ్ పొత్తుపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY