ఎస్ఈసీ ఈ-వాచ్‌ యాప్ ఈ నెల 9 వరకు నిలిపియాలని హైకోర్టు ఆదేశాలు

Andhra Pradesh, AP HC Postpone Hearing On E Watch App Petition, AP High Court, AP Panchayat Elections, AP SEC, ap sec e watch app, AP SEC E-Watch App For AP Panchayat Elections, AP SEC launched e-Watch app, E Watch App Petition, E Watch Application Launch, eWatch app for lodging election, Key Orders over Usage of SEC e-watch App, Mango News, New E Watch Application, SEC launches e-Watch app, YSRCP Government, YSRCP Government Moves HC Over New E Watch Application

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణ కోసం రూపొందించిన ‘ఈ-వాచ్‌’ యాప్ ‌ను ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈ-వాచ్‌ యాప్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీంతో శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ-వాచ్ యాప్ వినియోగాన్ని ఫిబ్రవరి 9 వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ యాప్ కు సంబంధించి సెక్యూరిటీ సర్టిఫికేషన్ అందలేదని విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి వచ్చింది. సర్టిఫికెట్ వచ్చేందుకు మరో ఐదు రోజులు పడుతుందని న్యాయవాది తెలపడంతో, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ నుంచి సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికెట్ వచ్చేంతవరకు యాప్‌ను అందుబాటులోకి తీసుకురావొద్దని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 9 వ తేదికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =