కాంగ్రెస్ కండువా కప్పుకున్న వైఎస్ షర్మిల

YS Sharmila Wearing a Congress Scarf, Sharmila Wearing Congress Scarf, Congress Scarf Wearing Sharmila, YS Sharmila, YSR Telangana Party, Congress, Mallikarjuna kharge, Rahul Gandhi, Latest YS Sharmila Congress News, YS Sharmila Congress News Update, AP Congress News, AP Congress News Sharmila, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YS Sharmila, YSR Telangana party, Congress, Mallikarjuna kharge, Rahul gandhi

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రస్థానం ముగిసింది. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయింది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్ అయ్యారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి.. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. బుధవారం తన భర్త బ్రదర్ అనిల్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. గురువారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి..  కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈరోజు నుంచి కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ ఒక భాగమని షర్మిల అన్నారు. కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారన్న షర్మిల.. తన తండ్రి అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో తాము పోటీ చేయలేదని షర్మిల స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కల అని షర్మిల అన్నారు. అది నెరవేర్చడానికి తాను మనస్ఫూర్తిగా పని చేస్తానని.. పార్టీ హైకమాండ్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వివరించారు. అయితే ముందు నుంచి కూడా షర్మిల చేతికి ఏపీపీసీసీ పగ్గాలు అందిస్తారని ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. మరి అందరూ అనుకుంటున్నట్లుగానే పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారా..? లేదా ఇంకా ఏదైనా కీలక పదవి అప్పగిస్తారా అనేది చూడాలి.

ఇకపోతే 2021లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించారు. తన సోదరుడు వైఎస్ జగన్‌తో విభేదాలు రావడంతో తెలంగాణలో ఈ పార్టీని నెలకొల్పారు. 2021 జులై 8న తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తన వైఎస్సార్‌టీపీని ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణలో పాదయాత్ర కూడా చేశారు. అప్పటి కేసీఆర్ పాలన, అవినీతిపై పెద్ద యుద్ధమే చేసి.. సంచలనంగా మారారు.  ఆ తర్వాత అనూహ్యంగా సైలెంట్ అయిపోయిన షర్మిల.. అప్పట్లోనే కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తారని వార్తలొచ్చాయి. కానీ అప్పటి పరిస్థితుల వల్ల అది జరగలేదు. చివరికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌టీపీ పోటీ చేయలేదు. కాంగ్రెస్‌కు మద్ధతు ఇచ్చింది. ఇక ఏపీ ఎన్నికల ముంగిట షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 15 =