
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన పర్చూరు నియోజకవర్గం. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ రెండు సార్లు తెలుగు దేశం పార్టీ గెలిచింది. మరోసారి కూడా గెలిచి.. హ్యాట్రిక్ కొడతామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సాంబశివరావు, వైఎస్సార్సీపీ అభ్యర్థి యడం బాలాజీ పోటీ పడుతున్నారు. అయితే ఈసారి కూడా ఇక్కడ పసుపు జెండా గాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ఏలూరి సాంబశివరావు ..ఈసారి కూడా విజయాన్ని సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు రామనాథం బాబు పర్చూరు నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. కానీ అతను ఆశించిన విధంగా ప్రజల్లో పార్టీని బలోపేతం చేయకపోవడం వల్ల ఆమంచి కృష్ణమోహన్ కు ఆ బాధ్యతలను అప్పజెప్పారు. కానీ ప్రజలకు మంచి చేయాల్సిన ఆమంచి తన సొంత లాభాలకోసం గ్రానైట్ పరిశ్రమలను తన చేతుల్లోకి తీసుకున్నారట. అలాగే సొంత పార్టీ నేతల పైనే కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేశారన్న అపవాదు కూడా ఉంది.
7 వేల టీడీపీ ఓట్లను కూడా తొలగించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన..ఆ తర్వాత వైసీపీని వదిలి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయన వెళ్లిపోవడంతో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలాజీని ప్రకటించారు సీఎం జగన్. కాపు కోటాలో బాలాజీని ఎన్నికల బరిలోకి దింపినా.. ఇక్కడ గెలవడం అంత సులభమేమీ కాదని వైఎస్సార్సీపీ అధిష్టానానికి కూడా తెలుసన్నది స్థానికుల వాదన.
బాలాజీ ఇక్కడికి గెలవడానికి బాగానే కష్టపడ్డారు. కాపు సామాజిక వర్గ ప్రజల ఓట్లన్నీ తనకే పడతాయని అనుకున్నా.. వారి నుంచి ఈ నేతకు పెద్దగా ఆదరణ లభించలేదన్న వాదన వినిపిస్తోంది.పర్చూరు నియోజకవర్గంలో 70 వేల కమ్మ సామాజిక ఓటర్లు ఉండగా.. వీరి తర్వాత స్థానంలో 40 వేల కాపు ఓట్లు ఉన్నాయి. అందుకే ఏ ఎన్నికలలో అయినా ఈ రెండు సామాజిక వర్గాలే పర్చూరు నియోజకవర్గంలో గెలుపోవటములను ప్రభావితం చేస్తాయి.
అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ వైపు చాలామంది కాపులు మొగ్గు చూపారు. దీంతో టీడీపీ కూటమిగా జత కట్టడంతో..సగం మంది కాపులు టీడీపీకే సపోర్టు చేస్తున్నారు.ఇక 80% కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలెప్పుడూ టీడీపీ వైపు ఉంటారు. మిగతా సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు రెండు పార్టీలకు సమానంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే వైసీపీకి ఈసారి కూడా గెలిచే అవకాశాలు లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY