ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవడంతో..ఎక్కడ చూసినా గెలుపోటములపైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ప్రధాన పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏపీలో వైసీపీ అధికారంలో కొనసాగబోదని ఫేమస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. ఏపీలో అధికార వైసీపీకి ఘోరమైన పరాజయం ఎదురవుతుందని ఆయన మళ్లీ తేల్చి చెప్పారు.
ఎన్నికలకు ముందు తమ ఓటమిని ఏ రాజకీయ నాయకుడూ అంగీకరించరని జగన్ మీద పీకే కౌంటర్లు విసిరారు. పదేళ్లకు పైగానే ఎన్నికల క్షేత్రంలో పని చేస్తున్న అనుభవం తనకుందని పీకే చెప్పారు. అంతెందుకు ఓట్ల లెక్కింపు రోజు నాలుగైదు రౌండ్లు పూర్తయిన తర్వాతా కూడా రాజకీయ నాయకులెవరూ తమ ఓటమిని అంగీకరించరని సెటైర్ వేశారు. మరోవైపు, దేశవ్యాప్త ఎన్నికల పరిణామాలపైన కూడా పీకే చర్చించారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గతంలో కంటే సీట్లు తక్కువ ఏమీ రావని.. అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ, ప్రధాని మోడీలపై ప్రజల్లో అసంతృప్తి అయితే ఉంది కానీ, ఆగ్రహం మాత్రం లేదని పీకే చెప్పారు.దీంతో భారతీయ జనతా పార్టీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా అయినా లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఇటీవల ఏపీ సీఎం జగన్ పీకే గతంలో ఏపీలో వైసీపీ ఓడిపోతుందన్న కామెంట్లకు జగన్ సమాధానమిచ్చారు. ఐదేళ్లపాటు ప్రజలకు మంచి పాలన అందించామని, ప్రజలు మనకు మంచి ఫలితాలు అందించబోతున్నారని వెల్లడించారు. జూన్ 4న వచ్చే ఫలితాలను చూసి.. దేశంలోని అన్ని రాష్ట్రాలూ మనల్నే చూస్తాయన్నారు.
ఐ ప్యాక్ సేవలు మరువలేనివని జగన్ తెలిపారు. విజయవాడలోని ఐ ప్యాక్ బృందంతో సమావేశమైనపుడు.. ఈసారి గతం కన్నా ఎక్కువ ఫలితాలు వస్తాయన్నారు. 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీల మార్క్ దాటబోతున్నామని చెప్పారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు జగన్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మధ్యలో మాట మార్చాడాని, పీకే కూడా కలలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని పేర్కొన్నారు.దీంతో ఓటమిని ముందే ఎవరూ అంగీకరించరంటూ జగన్‌కు పీకే మరోసారి కౌంటర్ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY