ఆర్ అండ్ బీ శాఖపై సీఎం జగన్ కీలక సమీక్ష.. రోడ్లపై ఫిర్యాదులకు ‘ఏపీ సీఎం ఎంఎస్ యాప్‌’ ప్రారంభం

CM Jagan Held Review on R and B Department Launches AP CM MS App For Complaints Regarding Roads,CM Jagan Review on R&B Department,Launch of AP CM MS App,Jagan Review on R&B Department,Mango News,Mango News Telugu,Ap Cm App Download,Ap Cms Csc.App,Cms Csc Online Ap App,Ap Cm Schedule,Ap Cm Tomorrow Schedule,Ap Csp Vs Ap Csa,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్లు, భవనాలు (ఆర్ అండ్ బీ) శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయితీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో రోడ్లకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఆర్ అండ్ బీ శాఖ కొత్తగా రూపొందించిన ‘ఏపీ సీఎం ఎంఎస్ యాప్‌’ను ప్రారంభించారు. ఇంకా సమావేశంలో భాగంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఆర్ అండ్ బి శాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు, ఆదేశాలు..

 • రాష్ట్రంలో ప్రస్తుతం గుంతలు పడ్డ రోడ్లను పూర్తిగా బాగు చేయడంతో పాటు కొత్తగా వేసే రోడ్లను నాణ్యతతో వేయాలి.
 • ఒకటి, రెండేళ్లకే రిపేర్లు వచ్చేలా కాకుండా.. ఒక్కసారి వేస్తే ఏడేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా చూడాలి.
 • దీనికోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ప్రధాన రోడ్లన్నింటినీ పూర్తి చేయాలి.
 • ఇక ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు కుంగిపోవడం మరియు త్వరగా పాడైపోవడం వంటివాటిని నిరోధించేందుకు ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీ వినియోగించేందుకు అధికారులకు పర్మిషన్.
 • దీనిలో భాగంగా మొదటి దశలో 1,000 కి.మీ మేర ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో చేపట్టాలి.
 • అలాగే వచ్చే జూన్, జులై నాటికి నిర్దేశించుకున్న రోడ్లు, అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలు పూర్తి చేయాలి.
 • విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు మరియు కడప-బెంగళూరు రైల్వే లైనుపై దృష్టి పెట్టాలి.
 • పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ దృష్ట్యా సత్వరమే రోడ్లు రిపేర్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
 • ఈ క్రమంలో రోడ్లపై ఫిర్యాదులు చేసేందుకు సాధారణ ప్రజలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ‘ఏపీ సీఎం ఎంఎస్ యాప్‌’ను వినియోగించాలి.
 • ఎప్పటికప్పుడు రోడ్లకు సంబంధించిన ఫోటోలను దీనిలో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తమ ప్రాంతంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావొచ్చు.
 • ఇక ఈ యాప్‌లో ఫిర్యాదు అందిన 60 రోజుల్లో అధికారులు ఆ రోడ్లను మరమ్మతు చేయాల్సి ఉంటుంది.
 • రోడ్ల బాగుకోసం ప్రభుత్వం ఎన్నో నిధులను కేటాయిస్తోందని, వీటిని సమర్ధవంతంగా వినియోగించి రోడ్ల నిర్వహణ అత్యుత్తమంగా ఉండేలా చూడాలి.
 • అలాగే దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను పనిచేసి చూపించడం ద్వారా బలంగా తిప్పికొట్టాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here