రాయలసీమలో వైసీపీకి ఎదురు దెబ్బ

YCP Suffered A Heavy Defeat In Rayalaseema,Heavy Defeat In Rayalaseema,YCP Suffered A Heavy,YSRCP Pulls Out All Stops,Lok Sabha Elections 2024,AP Exit Polls 2024,Pulivendula Election Results 2024,YCP Opposition Status,Andhra Pradesh Elections,Andhra Pradesh Elections Results,Exit Polls Results,AP Politics,Jagan,YCP,AP,Mango News,Mango News Telugu, Rayalaseema,Kurnool
YCP, Jagan, Rayalaseema, ap elections

వైసీపీకి కంచుకోట రాయలసీమ. గత రెండు పర్యాయాలు రాయలసీమ ప్రజలు వైసీపీ వైపే నిలబడ్డారు. గత ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 49 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది. ఈసారి కూడా రాయలసీమపై వైసీపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. రాయలసీమ ప్రజలు తమవైపే ఉన్నారనే ఆశతో ఉంది. కానీ ఒక్కసారిగా వైసీపికి రివర్స్ అయ్యారు రాయలసీమ ప్రజలు. కోలుకోలేని దెబ్బ కొట్టారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలను చూసుకుంటే.. రాయలసీమలో నలభైకి పైగా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. రాయలసీమలో కనీసం పది స్థానాలను కూడా వైసీపీకి గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు.

గత ఎన్నికల్లో రాయలసీమలోని 49 స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. ఈసారి 52 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రాయలసీమ ప్రజలు మాత్రం వైసీపీని దూరం పెట్టి.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి జై కొట్టారు. ఈసారి రాయలసీమలో కచ్చితంగా 40కి పైగా స్థానాల్లో కూటమి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ ఫ్యామిలీ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీ క్లిన్ స్వీప్ చేసింది. పదికి పది స్థానాలను గెలుచుకుంది. కానీ ఈసారి జగన్ సొంత జిల్లాలోనే ఆయనకు ఎదురు దెబ్బ తగులుతోంది. కడపలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు.

అనంతపురం, కర్నూల్, చిత్తూరులో కూడా కూటమి జోరు కొనసాగుతోంది. టీడీపీ కూటమికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయిదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ రాయలసీమ ప్రజలను మెప్పించడంలో విఫలమయిందని.. అందుకే ఈ సరిస్థితి వచ్చిందనే వాదన వినిపిస్తోంది. రాయలసీమ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో వైసీపీ సర్కార్ ఫెయిల్ అయిందని.. అందుకే ఇటువంటి ఫలితాలు వస్తున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న ఆగ్రహాన్ని రాయలసీమ ప్రజలు ఓట్ల రూపంలో చూపించారని చెబుతున్నారు. ఒక్క రాయలసీమలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా వైసీపీ చితకలబడిపోయింది. కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY