చంద్రబాబు అరెస్ట్‌తో ఉద్రిక్తంగా మారిన ఆంధ్రప్రదేశ్

AP High Tension Prevails Statewide During TDP Chief Chandrababu Naidu Arrest,AP High Tension,Tension Prevails Statewide,During TDP Chief Chandrababu Naidu Arrest,Chandrababu Naidu Arrest,TDP Chief Chandrababu Naidu,Mango News,Mango News Telugu,Chandra Babu arrest, BJP AP chief Purandheswari, Chandra Babu, CPI leaders,Balakrishna, Pavan Kalyan,Tdp leaders,TDP Chief Chandrababu Naidu Latest News,TDP Chief Chandrababu Naidu Latest Updates,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

లీకులే వినిపించాయో.. సిక్త్స్ సెన్స్ పని చేసిందో కానీ తన అరెస్ట్ గురించి రెండు రోజుల ముందు నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా చెప్పేశారు. అయితే ఎవరూ ఏమాత్రం ఊహించని రీతిలో శుక్రవారం అర్ధరాత్రి నానా హడావుడి చేసిన పోలీసులు.. హైలెవల్ హైడ్రామా తర్వాత శనివారం తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దే భారీగా మోహరించిన పోలీసులు, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి మరీ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు.

ఇంతకీ తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పమని చంద్రబాబు డిమాండ్ చేయడంతో.. అరెస్ట్‌కు సంబంధించిన పేపర్లు చూపించిన పోలీసులు.. చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అయితే తన హక్కులు ఉల్లంఘిస్తున్నారంటూ గగ్గోలు పెట్టినా.. ఇదేం రాక్షస చర్య అని గట్టిగా ప్రశ్నించినా లాభం లేకుండా పోయింది. ఏ చట్టం ప్రకారం ఈ అరెస్ట్ అని నిలదీసినా.. ప్రాథమిక ఆధారాలే లేకుండా ఎలా నన్ను అదుపులోకి తీసుకుంటారని అడిగినా.. పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుపోయారు. ప్రాథమిక ఆధారాలు హైకోర్టుకు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకొన్నారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి.. విజయవాడకు తరలించారు.

మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మొత్తం రూ. 550 కోట్ల అక్రమాలు జరిగినట్లు.. అందులో చంద్రబాబు ఇన్‌వాల్వ్‌మెంట్ ఉందని గుర్తించినట్లు చెప్పారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో ఎక్స్‌లెన్స్ సెంటర్లు పెట్టడానికి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌‌ను ఏర్పాటు చేశారని సంజయ్ చెప్పారు.అయితే ఈ ప్రాజెక్ట్ కోసం అప్పటి ప్రభుత్వం రూ. 371 కోట్లు విడుదల చేసిందని.. ఆ నగదులో చాలా వరకు నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్ కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేశారని ఆరోపించారు.

ఇవన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని, చాలా కీలక పత్రాలు కూడా మాయం చేసినట్లు తేలడం వల్లే చంద్రబాబును అరెస్ట్ చేశామన్నారు. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తామని.. ఆ తర్వాతే ఈ స్కామ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు బయటపడుతాయని అన్నారు.

ఇటు చంద్రబాబు అరెస్ట్‌పై న్యాయపోరాటానికి దిగుతామని.. కోర్టులోనే తేల్చుకుంటామని హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పగా.. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ మద్దతు చంద్రబాబుకేనని తేల్చి చెప్పారు. మరోవైపు కనీసం చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్‌లో లేకుండా అరెస్ట్ చేయడంతో.. వివిధ పార్టీల కీలక నేతలు, సినీ ఇండస్ట్రీలోని కొంతమంది ఈ అరెస్ట్‌ను ఖండిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌తో విజయవాడతో పాటు ఏపీ వ్యాప్తంగా అక్కడక్కడ అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇప్పటికే పోలీసులు ముందస్తు జాగ్రత్తగా.. టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాదు ఏపీ వ్యాప్తంగా బస్సులను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here