విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష

AP CM Meeting Education Department Officials, AP CM YS Jagan Review Meeting, AP CM YS Jagan Review Meeting With Education Department, AP Education Department, AP Latest News, AP News, AP Political Updates, AP Politics, Education Department Officials, Mango News, TDP latest news, YS Jagan Held Review with Education Department Officials, YS Jagan reviews on Education department

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో టాయిలెట్స్‌ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్‌ యాప్‌పై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ అనేది చాలా ప్రాధాన్యతా అంశమని చెప్పారు. కొన్ని పాఠశాల్లో టాయిలెట్లు లేకపోవటం, ఉన్నవాటిని కూడా సక్రమంగా నిర్వహించకపోవటం వల్ల పిల్లలు పాఠశాలలకు పోలేని పరిస్థితి నెలకొందని అన్నారు.

ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఏవైనా మరమ్మతులు వచ్చినా వెంటనే బాగుచేసేలా ఒక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె వెట్రి సెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =