ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాలకు గానూ.. 164 స్థానాల్లో కూటమి గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక తిరుగులేదు.. కూటమి ప్రభుత్వ పాలనకు ఎదురేలేదు అనుకున్న సమయంలో ఊహించని ఎదురు దెబ్బ తగలింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కూడా కాకముందే చేధ అనుభాన్ని ఎదుర్కోవాల్సివచ్చింది. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఓటమి పాలయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన వైసీపీ.. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మొత్తం క్లీన్ స్వీప్ చేసి పరేసింది.
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఆరు డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఆ ఆరు డివిజన్లలో వైసీపీ గెలుపొందింది. క్లీన్ స్వీప్ చేసింది. అది కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. వైసీపీ అభ్యర్థఉలు నిర్మల కుమార్ రెండో డివిజన్ నుంచి.. మూడో డివిజన్ నుంచి భీమిశెట్టి ప్రవళిక.. 33వ డివిజన్ నుంచి బాపటి కోటిరెడ్డి గెలుపొందారు. అలాగే 41వ డివిజన్ నుంచి మహ్మద్ ఇర్ఫాన్.. 46వ డివిజన్ నుంచి వల్లూరి ఎన్డీఎస్ మూర్తి 57వ డివిజన్ నుంచి ఈసరాపు దేవిలు పోటీ చేసి గెలుపొందారు.
నిర్మల్ కుమార్, భీమిశెట్టి ప్రవలిక, ఈసరావు దేవిలకి 47 చొప్పున ఓట్లు పోలయ్యాయి. అలాగే బాపటి కోటిరెడ్డికి 46 ఓట్లు పోలవ్వగా.. వల్లూరి ఎన్డీఎస్ మూర్తి, మహ్మద్ ఇర్ఫాన్‌లకు 45 చొప్పున ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్‌లో వైసీపీకి 49 మంది కార్పోరేటర్లు.. టీడీపీకి 13 మంది.. బీజేపీ, సీపీఎంలకు ఒక్కొక్కరు చొప్పున కార్పోరేటర్లు ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఇంఛార్జ్ డాక్టర్ మహేష్ డిక్లరేషన్ సర్టిఫికేట్లను అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE