‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని అర్హులందరికీ అందిస్తున్నాం, అయితే 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి – మంత్రి బొత్స

AP Minister Botsa Satyanarayana Interesting Comments on Jagananna Amma Vodi Scheme, Minister Botsa Satyanarayana Interesting Comments on Jagananna Amma Vodi Scheme, Botsa Satyanarayana Interesting Comments on Jagananna Amma Vodi Scheme, Minister Botsa Satyanarayana Sensational Comments on Jagananna Amma Vodi Scheme, Interesting Comments on Jagananna Amma Vodi Scheme, Jagananna Amma Vodi Scheme, AP Education Minister Botsa Satyanarayana, AP Minister Botsa Satyanarayana, Education Minister Botsa Satyanarayana, Minister Botsa Satyanarayana, AP Education Minister, Botsa Satyanarayana, Amma Vodi Scheme, Jagananna Amma Vodi Scheme News, Jagananna Amma Vodi Scheme Latest News, Jagananna Amma Vodi Scheme Latest Updates, Jagananna Amma Vodi Scheme Live Updates, Mango News, Mango News Telugu,

‘జగనన్న అమ్మ ఒడి’ పథకంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో రూ. 1.96 కోట్ల నిధులతో నిర్మించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయనగరంలో ప్రతి ఇంటికీ మంచి నీటి కొళాయి ఏర్పాటుచేయడానికి ప్రణాళికలు వేస్తున్నామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇంటర్ ఫలితాలపై వస్తున్న విమర్శలకు ఆయన సమాధానమిస్తూ 2019లో కంటే మెరుగైన ఫలితాలే వచ్చాయని తెలిపారు. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని అర్హులందరికీ అందిస్తున్నామని, అయితే 75% హాజరు తప్పనిసరిగా ఉండాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్ఫష్టం చేశారు.

విద్యార్థులు ఆర్ధిక సమస్యల కారణంగా మధ్యలో పాఠశాలలను వీడుతున్నారని, దీనిని అరికట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడిని ప్రారంభించారని మంత్రి గుర్తుచేశారు. అయితే దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడిని ఆగదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముందుగానే అందరు విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేశామని వెల్లడించారు.  కాగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం అమ్మ ఒడి పథకం క్రింద ప్రతి ఒక్క విద్యార్థికి రూ. 15 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఈ సంవత్సరం నుంచి రూ. 13 వేలు అందిస్తామని తెలిపారు. కోత విధించిన రూ. 2 వేలలో, ఒక వెయ్యి రూపాయలు పాఠశాలల మెయింటెనెన్స్‌కు, మరో వెయ్యి వాచ్‌మెన్‌, ఇతర అవసరాలు వినియోగిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here