జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం.. ప్రకటించిన ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

ISRO Successfully Launches Next-Gen Navigational Satellite GSLV-NVS-01 Navic From Sriharikota,ISRO Successfully Launches Next-Gen Navigational Satellite,Next-Gen Navigational Satellite,GSLV-NVS-01 Navic From Sriharikota,Navigational Satellite GSLV-NVS-01,Mango News,Mango News Telugu,GSLV-NVS-01,ISRO Latest News,GSLV-F12NVS-01 Navigation Satellite,ISRO,ISRO Latest News,ISRO Latest Updates,ISRO Live News,ISRO Navigation Satellite Latest Updates,ISRO Navigation Satellite Live News,Sriharikota News Updates

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో చైర్మన్‌ డా. సోమనాథ్‌ ప్రకటించారు. అంతకుముందు సోమవారం ఉదయం షార్ రాకెట్ ప్రయోగ కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి 10:42 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో నిర్ణీత సమయంలో ఎన్‌వీఎస్ – 01 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇక జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేతలు సంబరాలు చేసుకున్నారు. చైర్మన్ సోమనాథ్ సహచర శాస్త్రవేత్తలను అభినందించించారు.

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్‌ మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, ఇది ఇస్రో సభ్యుల కృషి వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇక ఎన్‌వీఎస్ – 01 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరిందని, రాకెట్ ప్రయోగంలో క్రయోజనిక్ స్టేజి చాలా కీలకమైందని, ఆ స్టేజ్‌ కూడా సవ్యంగా సాగిందని తెలిపారు. కాగా ఈ రాకెట్ విజయవంతంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని, ఈ ఉపగ్రహం దేశీయ నేవిగేషన్ సేవలు అందించనుందని వెల్లడించారు. ఇక జీఎస్ఎల్వీ ఎఫ్ – 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు కాగా.. బరువు 2,232 కిలోలని వివరించారు. దీని జీవితకాలం 12 ఏళ్లు అని, ఈ ఉపగ్రహం భారతదేశ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్‌ టైమ్‌ పొజిషనింగ్‌ సేవలను అందిస్తుందని చెప్పారు. నావిగేషన్‌ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నామని చైర్మన్ సోమనాథ్‌ తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here