తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి 2,71,592 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధికి మెజార్టీ భారీగా పెరిగింది. వైస్సార్సీపీకి 626108 ఓట్లు, టీడీపీకి 354516, బీజేపీకి 57080, కాంగ్రెస్ కు 9585 ఓట్లు వచ్చాయి. తిరుపతి పోరులో మొత్తం 28 మంది బరిలో నిలిచారు. వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి ఎం.గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఈ ఉపఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాగా ఈ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థికే ప్రజలు పట్టం కట్టారు. మరోవైపు కేంద్రఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దని నాయకులకు, పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ