రాజ్యసభకు కొత్తగా ఎంపికైన సభ్యులను జూలై 23, గురువారం నాడు రాజసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వివిధ స్టాండింగ్ కమిటీలకు నామినేట్ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ లకు కూడా ఈ స్టాండింగ్ కమిటీల్లో చోటు దక్కింది. ఎంపీ అయోధ్య రామిరెడ్డిని అర్బన్ డెవలప్మెంట్ విభాగం సభ్యుడిగా, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పరిశ్రమల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, మోపిదేవి వెంకటరమణను బొగ్గు, ఉక్కు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పరిమళ్ నత్వానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో సభ్యుడిగా నియమించారు. అలాగే తెలంగాణ నుంచి టిఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన కె.ఆర్.సురేష్ రెడ్డిని ప్రజా ఫిర్యాదు చట్టం, న్యాయ వ్యవస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. సీనియర్ పార్లమెంటు సభ్యుడు కె.కేశవరరావు ఇంతకు ముందు నుంచే పరిశ్రమల శాఖ స్థాయీ సంఘం చైర్మన్‌గా కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu