సమయం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా టీడీపీ పగ్గాలు అందుకుంటాడు – మాజీ మంత్రి కొడాలి నాని

AP Ex Minister Kodali Nani Sensational Comments Over Junior NTR Entry into Politics, Kodali Nani Sensational Comments Over Junior NTR Entry into Politics, Junior NTR Entry into Politics, Junior NTR Political Entry, Entry into Politics, AP Ex Minister Kodali Nani, Kodali Nani, Junior NTR, Junior NTR Politics, Junior NTR Political Entry News, Junior NTR Political Entry Latest News And Updates, Junior NTR Political Entry Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చెప్పాననో.. లేదంటే మరొకరు చెప్పారనో జూనియర్ రాజకీయాల్లోకి రాడని, సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వస్తాడని స్పష్టం చేశారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పగ్గాలు కూడా తీసుకుంటాడని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కూడా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని.. ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరో కొత్త పార్టీ పెట్టుకుని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తో కలిసి పోటీ చేస్తారని అన్నారు. అయితే చంద్రబాబుకి, పవన్‌కు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఎవరు ఎలా కలిసినా చివరికి గెలిచేది మాత్రం సీఎం జగనే అని, ఆ నాలుగు పార్టీలు సీఎం జగన్ దెబ్బకి కకావికలం అవుతాయని తేల్చి చెప్పారు. కాగా కొడాలి నాని చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here