ప్రముఖ రంగస్థల నటుడు, పద్మశ్రీ సురభి నాగేశ్వరరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR Mourns the Death of Famous Stage Actor Padma Shri Surabhi Nageswara Rao, CM KCR has expressed condolences over the death of Padma Shri Surabhi (Rekandar) Nageshwara Rao, Padma Shri Surabhi Nageshwara Rao, Padma Shri Rekandar Nageshwara Rao, Nageshwara Rao, Padma Shri, Famous Stage Actor Padma Shri Surabhi Nageswara Rao, Famous Stage Actor, CM KCR Mourns the Death of Famous Stage Actor, Telangana CM KCR Mourns the Death of Famous Stage Actor, KCR Mourns the Death of Famous Stage Actor, theatre artist Rekandar Surabhi passes away, Rekandar Surabhi passes away, Rekandar Surabhi passed away, Mango News, Mango News Telugu,

ప్రముఖ రంగస్థల నటుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ సురభి (రేకందార్) నాగేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. సంగీత, నాటకరంగానికి శతాబ్ధానికి పైగా సురభి సంస్థ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనవని సీఎం కొనియాడారు. తెలుగు వారికి సుపరిచితమైన సురభి సంస్థ వారసుడిగా, నాటక రంగానికి నాగేశ్వర్ రావు చేసిన సాంస్కృతిక సేవ గొప్పదన్నారు. నాగేశ్వర్ రావు మరణం సురభి సంస్థకే కాకుండా, యావత్తు నాటకరంగానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

4 సంవత్సరాల వయస్సులోనే సురభి నాగేశ్వరరావు బాలనటునిగా రంగస్థల ప్రవేశం చేశారు. శ్రీరామ, శ్రీకృష్ణ, వీరబ్రహ్మం, నక్షత్రక, మొదలైన పాత్రలుతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. సురభిలోని శ్రీ వెంకటేశ్వర నాట్యమండలికి 42 సంవత్సరాలు కార్యదర్శిగా ఉన్నారు. అలాగే సురభి నాటక కళా సంఘానికి అనేక సంవత్సరాలు కార్యదర్శిగా పని చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరరావు, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జూన్ 9, గురువారం సాయంత్రం హైదరాబాద్‌ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here