గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 11 మంది సభ్యులున్నారు. ఆగస్టు 27న ప్రసారమైన బిగ్ బాస్-3 ముప్పై ఏడవ ఎపిసోడ్ లో నామినేషన్ పక్రియ కొనసాగింది.
ఎపిసోడ్ 37 (ఆగస్టు 26) హైలైట్స్: నామినేషన్ పక్రియ, వరుణ్ సందేశ్ ని నామినేట్ చేసిన వితికా
- ఎపిసోడ్ ప్రారంభంలో రాహుల్, పునర్నవి ముచ్చట్లు పెట్టారు. బయట తనకోసం చాలా మంది ఉన్నారని, నువ్వు కేవలం ఫ్రెండ్ వి మాత్రమే అని రాహుల్ పునర్నవి తో చెప్తాడు
- నగిరా నగిరా సాంగ్ ప్లే అవ్వగా ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
- బిగ్ బాస్ ఇంటిలోకి వీక్లీ పేపర్ పంపించారు. బాబాభాస్కర్ వంట, అలీరేజా సిక్స్ ప్యాక్ డాన్స్, వితికా గేమ్, పునర్నవి-రాహుల్ ట్రాక్ గురించి ఈ పేపర్లో ప్రస్తావించారు
- శివజ్యోతి, రవికృష్ణ నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు
- నామినేషన్స్ పక్రియ తనకు నచ్చడం లేదని అలీరేజా, మహేష్ తో చెప్పిన బాబాభాస్కర్
- ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ పక్రియను బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్ గా నిర్వహించాడు
- హౌజ్ కెప్టెన్ గా ఉన్న శివజ్యోతికి ఈ నామినేషన్స్ నుండి మినహాయింపు లభించగా, మిగిలిన 10 మంది సభ్యులను ఇద్దరిద్దరుగా డివైడ్ కావాలని ఆదేశించారు.
- అలీ-రవి, శ్రీముఖి-హిమజ, వరుణ్-పునర్నవి, రాహుల్-వితికా, బాబాబాస్కర్-మహేష్ విట్టా లు జోడీలుగా ఏర్పాడ్డారు
- ఈ జంటలలో ఒకరిని నామినేట్ చేసి రెండో వ్యక్తిని సేవ్ చేయాలనీ మిగతా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఆదేశిస్తాడు
- ఒక్కో జంటను వేలాది దీసిన బకెట్ల కింద నిలబెట్టి నామినేట్ అయిన సభ్యుడిపై బురద నీళ్లు పడేలా ఏర్పాటు చేశారు
- వరుణ్ సందేశ్-పునర్నవి జోడిలో వితికా ఆశ్చర్యంగా వరుణ్ సందేశ్ ని నామినేట్ చేస్తుంది.
- ఈ ప్రక్రియలో హిమజ, రాహుల్, పునర్నవి, రవికృష్ణ, మహేష్ లకు ఎక్కువ ఓట్లు వచ్చి నామినేట్ అవ్వగా, ఎవరు నామినేట్ చేయని శ్రీముఖి,అలీ, బాబాబాస్కర్, వరుణ్ సందేశ్, వితికాలో ఒకరిని నామినేట్ చేయాలనీ బిగ్ బాస్, ఇంటి కెప్టెన్ శివజ్యోతిని కోరగా తను వరుణ్ సందేశ్ ని నామినేట్ చేస్తుంది
- ఈ వారం మొత్తం ఆరుగురు సభ్యులు హిమజ, రాహుల్, పునర్నవి, రవికృష్ణ, మహేష్, వరుణ్ సందేశ్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్నారు.
- తరువాత ఇంటిసభ్యులు గ్రూపులు వారీగా నామినేషన్స్ గురించి చర్చించుకున్నారు.