ప్రధాని మోడీని కలిసిన పీవీ సింధు

Mango News Telugu, PV Sindhu Creates History, PV Sindhu Meets PM Modi, PV Sindhu Meets PM Narendra Modi, PV Sindhu Wins BWF World Championships Final, PV Sindhu Wins World Badminton, PV Sindhu Wins World Badminton Championship, PV Sindhu Wins World Badminton Championship Gold, World Badminton Championship Winner PV Sindhu, World Badminton Championship Winner PV Sindhu meets PM, World Badminton Championship Winner PV Sindhu meets PM Modi

ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట(పీవీ) సింధు ఈ రోజు కోచ్ గోపీచంద్ తో కలిసి మర్యాదపూర్వకముగా ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఆగస్టు 26, సోమవారం రాత్రి స్విట్జర్లాండ్ నుండి ఢిల్లీకి చేరుకున్న ఆమె, మంగళవారం ఉదయం మోడీని కలిశారు. తన నివాసానికి వచ్చిన గోపీచంద్, పీవీ సింధులను ప్రధాని మోడీ అభినందించారు. తన ఆనందాన్ని ప్రధానితో పంచుకుని, బంగారు పతాకాన్ని చేతికి అందివ్వగా ఆయన ఆ పతాకాన్ని సింధు మెడలో వేసి సత్కరించారు. మోడీని కలిసిన వారిలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు, సింధు కోచ్ కిమ్ జి హ్యూన్ కూడ ఉన్నారు.

పీవీ సింధును అభినందించిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ బంగారు పతకం గెలిచిన ఛాంపియన్ సింధు దేశం కీర్తి ప్రతిష్టతలు పెంచి గర్వపడేలా చేసింది. ఆమెను కలుసుకోవడం ఆనందంగా ఉంది. భవిష్యత్ లో ఇలాంటి ఎన్నో గొప్ప విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోడీ ట్వీట్ చేసారు. రాత్రి స్వదేశానికి చేరుకున్న పీవీ సింధుకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది, అదేవిధముగా ఈ రోజు హైదరాబాద్ రానున్న సింధుకు స్వాగతం చెప్పేందుకు కుటుంబ సభ్యులు, అభిమానులు సిద్ధమవుతున్నారు.


Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here