టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా శీరీష్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శిరీష్ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయని క్రమంలో శిరీష్ కన్నుమూసినట్లు తెలుస్తోంది.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను శిరీష్ భరద్వాజ్ 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోనప్పటికీ ఎదురించి మరీ వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి ప్రేమ పెళ్లి వ్యవహారం సంచలనంగా మారింది. ఆ తర్వాత కొద్దిరోజులుగా వీరికి ఒక కుమార్తె పుట్టింది. కానీ వీరి వైవాహిక జీవితం ఎన్నో ఏళ్లు నిలవలేదు. కొద్దిరోజులకే వారిమధ్య మనస్పర్థాలు రావడంతో.. 2014లో వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ సమయంలో అదనపు కట్నం కోసం శిరీష్ తనను వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత 2016లో మరో పెళ్లి చేసుకుంది. ప్రముఖ వ్యాపారేవత్త కళ్యాణ్ దేవ్‌ను వివాహమాడింది. బెంగళూరులో వీరి పెళ్లి అంగరంగవైభవంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. వారికి కూడా ఒక కుమార్తె పుట్టింది. అయితే కొద్దిరోజులకు వీరి మధ్య కూడా మనస్పర్థాలు రావడంతో.. గతేడాది ఇద్దరు విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వాళ్లు గడుపుతున్నారు. మరోవైపు శ్రీజ మొదటి భర్త శిరీష్ కూడా 2019లో మరో వివాహం చేసుకున్నారు. అటు బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తాజాగా కన్నుమూశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE