అదిరిపోయిన మెగాస్టార్ విశ్వంభర టీజర్..

Excited Megastar Vishwambhara Teaser

మెగాస్టార్ చిరంజీవితో బింబిసార ఫేమ్ వశిష్ఠ తో కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. దసరా సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదలయింది. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ సినిమా విశ్వంభర కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, సంక్రాంతికి వస్తుందనుకున్న విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ మారిపోయింది. దీన్ని భర్తీ చేసేందుకు మెగా అభిమానులకు మెగా ట్రీట్ అందించారు.

ఇక టీజర్ విషయానికి వస్తే టీజర్ లో కాన్సెప్ట్ గురించి అంత క్లారిటీ ఇవ్వకపోయినా విజువల్స్, యాక్షన్, ఎలివేషన్ ఇవన్నీ అదిరిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టీజర్ తో సినిమాపై అంచనాలను డబుల్ చేశారు. విజువల్స్, బీజీఎమ్, సినిమాటోగ్రఫీ చాలా వరకు అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఒక విశ్వాన్ని చూపించి.. చేపలాగా ఉన్న పక్షకులు గాల్లో ఎగరడం చూపించారు. ఇతర జంతువులను చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది. మిత్ర యుద్ధం వస్తుందని అన్నావ్‌గా. ఆ యుద్ధం ఎలా ఉంటుంది” అని ఓ పాప చెప్పే డైలాగ్‌తో చిరంజీవి ఎంట్రీ ఉంది.   ఇందులో చిరంజీవి మరింత యంగ్‌గా కనిపించారు. తర్వాత రాక్షసులతో చిరంజీవి ఫైట్ సీక్వెన్స్ సూపర్బ్‌గా ఉంది. కట్ చేస్తే భారీ హనుమాన్ విగ్రహం దగ్గర విలన్స్‌ను చితక్కొట్టే సీన్, హనుమంతుడిలాగే గద పట్టుకుని చిరంజీవి ఇచ్చిన స్టిల్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. నిమిషం 32 సెకన్ల నడివి ఉన్న విశ్వంభర టీజర్ అదిరిపోయింది.

యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా కథ, కథనాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో ఉండేలా కనిపిస్తున్నాయి. దర్శకుడు విశిష్ట ఈ సినిమాను విజువల్ వండర్, సోషియో ఫాంటసీ త్రిల్లర్‌, యాక్షన్‌ అడ్వెంచర్‌ మువీగా విశ్వంభరను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్‌ పనులు ముగింపుకు వచ్చేశాయి. భారీ విజువల్ వండర్‌గా ఈ మువీని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు ఈ మువీ నిర్మాతలు. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడం విశేషం. చిరంజీవి విశ్వంభర టీజర్ చూసిన మెగా ఫ్యాన్స్ ఈసారి సూపర్ హిట్ కొట్టేస్తున్నాం అంతే అని ఫిక్స్ అయ్యారు.