అక్కినేని ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు ఒకే రోజు నాగచైతన్య,అఖిల్‌ పెళ్లి ?

మొన్న చైతూ.. నిన్న అఖిల్ నిశ్చితార్ధంతో చాలా కాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొన్నట్లు అయింది. సమంత, నాగ చైతన్య విడిపోయాక.. సంతోషకరమైన వాతావరణమే కనిపించలేదు. అయితే రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగాక అక్కినేని ఫ్యామిలీలో మళ్లీ శుభపరిణామాలు కనిపిస్తున్నాయి.

మంగళవారం అఖిల్‌కు.. జైనబ్ రివ్జి ఎంగేజ్మెంట్ జరిగిందంటూ నాగార్జున చేసిన ట్వీట్‌తో అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 4 న నాగ చైతన్య శోభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో 3వందల మంది సన్నిహితుల మధ్య సింపుల్‌గా జరగబోతోంది. అయితే అఖిల్, జైనబ్ రివ్జీ పెళ్లి కూడా అదే రోజున జరగబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కొన్నాళ్లుగా నాగార్జున తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు చేయడం లేదనే ఒక చిన్న బాధలో ఉంటున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఇద్దరు కొడుకులకు పెళ్లి సెట్ అయింది కాబట్టి..ఒకేరోజు ఇద్దరి పెళ్లిళ్లు చేయాలనే ప్రయత్నంలో నాగార్జున ఉన్నట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే చైతన్య పెళ్లికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉందని..అప్పుడే అఖిల్ పెళ్లి కూడా చేస్తే సమయం సరిపోదు కాబట్టి ఇది కేవలం ఊహాగానాలే అని కొంతమంది కొట్టి పడేస్తున్నారు.

దీనిలో ఏది నిజం, ఏది పుకారు అన్నదానిపై సరైన స్పష్టత లేదు కానీ మొత్తానికి.. వీళ్ళిద్దరి పెళ్లి ఒకేరోజు జరిగితే మాత్రం అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు. పైగా ఇదొక రికార్డుగా మిగిలిపోతుంది. మరోవైపు అక్కినేని ఫ్యామిలీ ఇటు పర్సనల్ గా, అటు సినిమాల పరంగా కూడా అన్నీ శుభపరిణామాలే అన్న సంకేతాలు వస్తున్నాయి.

ఇటు నాగచైతన్య ‘తండెల్’ మూవీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అటు అఖిల్ భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. నాగార్జున అటు హీరోగా, ఇటు విలన్ గా కూడా చేస్తూ ఛాలెంజింగ్ పాత్రలను పోషిస్తూ నేటి హీరోలకు సవాల్ విసురుతున్నాడు.