67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో సత్తాచాటిన జెర్సీ, మహర్షి చిత్రాలు

2021 National Film Awards 2021, 67th National Film Awards, 67th National Film Awards Announced, 67th National Film Awards Full winners, 67th National Film Awards Full winners list, 67th National Film Awards Winners, 67th National Film Awards Winners List, Jersey and Maharshi Movies Got Awards, Mango News, national film awards, National Film Awards 2021, National Film Awards 2021 Winners

67వ జాతీయ చలనచిత్ర అవార్డులను సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా జాతీయఅవార్డుల ప్రకటన ఆలస్యం అయింది. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అందిస్తున్నాయి. 2019 సంవత్సరానికి సంబంధించి సినిమాలు మరియు నటులకు ఈ అవార్డులను ప్రకటించారు.

తెలుగు సినిమా పరిశ్రమ నుండి జాతీయ ఉత్తమచిత్రం(తెలుగు)గా నాని నటించిన జెర్సీ చిత్రం ఎంపికయింది. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో నవీన్‌ నూలి జెర్సీ సినిమాకి అవార్డు దక్కించుకున్నాడు. అలాగే ఉత్తమ పాపులర్ వినోదాత్మక చిత్రంగా మహర్షి, ఉత్తమ కొరియోగ్రాఫర్‌ గా మహర్షి చిత్రానికి గానూ రాజు సుందరం జాతీయ అవార్డులను దక్కించుకున్నారు. ఇక ఉత్తమ నటుడుగా ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాయ్‌పాయ్‌(భోంస్లే), ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌(మ‌ణిక‌ర్ణిక‌) జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.

అవార్డు విజేతల జాబితా:

  • ఉత్తమ చిత్రం: మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ (మలయాళం)
  • ఉత్తమ చిత్రం(హిందీ): చిచోరే
  • ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
  • ఉత్తమ వినోదాత్మక చిత్రం: మహర్షి (తెలుగు)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)
  • ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌ నూలి (జెర్సీ)
  • ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్‌
  • ఉత్తమ నటుడు: ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాయ్‌పాయ్‌(భోంస్లే)
  • ఉత్తమ నటి: కంగనా రనౌత్‌(మ‌ణిక‌ర్ణిక‌)
  • ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)
  • ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
  • ఉత్తమ దర్శకుడు: సంజయ్ పురాన్ సింగ్ చౌహన్ (బహత్తార్‌ హూరైన్)‌
  • ఉత్తమ సామాజిక చిత్రం: ఆనంది గోపాల్‌ (మరాఠి)
  • ‌ఉత్తమ పరిచయ దర్శకుడు: ముత్తుకుట్టి జోవియర్ (హెలెన్)
  • ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపధ్య చిత్రం : వాటర్ బరియల్ జాతీయ
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: జల్లికట్టు (మలయాళం)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: డి.ఇమ్మాన్ (విశ్వాసం)
  • ఉత్తమ ఆడియోగ్రఫీ: ఓత్థ సెరుప్పు సైజ్ 7 (తమిళ్)
  • బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సుజిత్ మరియు సాయి (మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ-మలయాళం)
  • బెస్ట్‌ మేకప్‌: రంజిత్ (హెలెన్-మలయాళం)
  • ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జ్యేష్‌తోపుత్రో (బెంగాలీ)
  • ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగులు): తాష్కెంట్ ఫైల్స్ (హిందీ)
  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: గుమ్నామి (బెంగాలీ)
  • స్పెషల్ జ్యూరీ అవార్డు : ఓత్థ సెరుప్పు సైజ్ 7 (తమిళ్)), రాధాకృష్ణన్ పార్తీబన్
  • ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : అవనే శ్రీమనారాయణ (కన్నడ)
  • ఉత్తమ లిరిక్స్: ప్రభా వర్మ కోలాంబి (మలయాళం)
  • ఉత్తమ స్పెషల్ఎఫెక్ట్‌ : మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ (మలయాళం)
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌ : ఆనంది గోపాల్‌ (మరాఠి)
  • ఉత్తమ నేపథ్య సంగీతం: ప్రభుద్ధ బెనర్జీ-జ్యేష్‌తోపుత్రో (బెంగాలీ)
  • ఉత్తమ గాయకుడు: బి ప్రాక్ (కేసరి-హిందీ-తేరి మిట్టీ)
  • ఉత్తమ గాయని: సవాని రవీంద్ర – బార్డో (మరాఠీ)
  • ఉత్తమ బాల నటులు: నాగ విశాల్ (కేడి-తమిళం)
  • ఉత్తమ పిల్లల చిత్రం: కస్తూరి (హిందీ)
  • ఉత్తమ చిత్రం (జాతీయ సమైక్యత): తాజ్‌మహల్ (మరాఠీ)
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =