జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ‘దేవర’. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కి ముందే ‘దేవర’ రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ ల వేట మొదలుపెట్టింది. అమెరికాలో దుమ్మురేపుతోంది. ఇటీవలే ఈ సినిమా టికెట్లను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సినిమా విడుదలవడానికి ముందే ఓవర్సీస్ లో ప్రీసేల్ బుకింగ్స్ తో మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుంది. నార్త్ అమెరికాలో ప్రీ బుకింగ్స్, ప్రీమియర్ షో బుకింగ్స్ కి సంబంధించి ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది దేవర. 1.05 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని ప్రకటించారు. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత వేగంగా ప్రీసేల్ ద్వారా ఒక మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకున్న సినిమాగా రికార్డును నెలకొల్పింది. అది కూడా ట్రైలర్ రిలీజ్ కాకముందే. ఇలా ట్రైలర్ రిలీజ్ కాకుండానే ప్రీ బిజినెస్ చేసిన మొదటి సినిమాగా ‘దేవర’ రికార్డులు సృష్టించింది. ఈ రికార్డుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా అవతరించిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈనెల 27వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని అత్యంత కసిగా ఆయన ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తొలి ఇండియన్ సినిమాగా అరుదైన రికార్డును నెలకొల్పింది.
కాగా ఈ రోజు 5 గంటల 4 నిమిషాలకు దేవర ట్రైలర్ రాబోతుంది. కాగా ఈ ట్రైలర్ నిడివికి సంబంధించి ఆశక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా ట్రైలర్ లెంగ్త్ 2 నిమిషాల 50 సెకండ్లను ఇన్ సైడ్ టాక్. అంతేకాకండా మరోవైపు ఈ సినిమా ట్రైలర్ 4 నిమిషాలు ఉండనుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేల ఇది నిజమైతే మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలే. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ట్రైలర్ 4 నిమిషాల నిడివితో రాలేదు. అలాంటిది దేవర కోసం ఏకంగా అంత లెంగ్తీ రన్ టైమ్ అంటే మాములు విషయం కాదు. కొరటాల సైతం ట్రైలర్‌ను ఊహకందని విధంగా కట్ చేశాడట.