పీకే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే న్యూస్

Pawans Song In That Movie, In That Movie Pawans Song, Pawan Kalyan, Pawans Song, OG Movie, Crazy News For Fans, Latest OG Movie Update, OG Movie Song, OG Movie News Update, OG Telugu Movie, Latest Tollywood Movie News, Pawan Kalyan, Tollywood News, Mango News, Mango News Telugu
Pawan Kalyan ,Pawan's song ,OG movie, Crazy news for fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో మరో వైపు సినిమా షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమధ్య పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌తో వచ్చిన  బ్రో హిట్ టాక్ ను తెచ్చుకుంది. తర్వాత సుజిత్ డైరక్షన్లో ఓజీలో నటిస్తున్నా..పొలిటికల్ హడావుడిలో పడి డేట్స్ అడ్జెస్ట్ చేయడంలో ఇబ్బంది పడటంతో అది షూటింగ్ లేటవుతుందనే టాక్ నడుస్తోంది.

ఇక ఇటు సుజిత్ ..రన్ రాజా రన్ తో దర్శకుడిగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సాహో తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా..బాలీవుడ్‌లో కలెక్షన్స్ వర్షం కురిపించింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీతో రెడీ అవడంతో పవన్ అభిమానుల అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఇప్పటికే ఓజీ మూవీ నుంచి గ్లింప్స్ విడుదలై ఫ్యాన్స్‌ను బాగానే అలరించింది . ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనుండగా.. కలకత్తా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది.

పవన్  కొన్ని సినిమాలకు తన వాయిస్ ఇవ్వడం,  తన సినిమాలో పాటలు పాడటం  కూడా చేస్తారన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలో పవన్ తన వాయిస్ వినిపించగా ..జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో పాటలు పాడారు పవన్.

అలాగే ఇప్పుడు పవన్ మరోసారి పాట రూపంలో తన గొంతు వినిపించనున్నాడని టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఓజీలో తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ తో ఈ సినిమాలో ఓ పాట పాడించడానికి తమన్ ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కానీ.. ఒక వేళ పవన్ కనుక పాటపాడితే  థియేటర్స్‌ దుమ్మురేపడం ఖాయం అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY