సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు – మెగాస్టార్ చిరంజీవి

AP CM Jagan For Resolving Telugu Film Industry Problems, AP Govt, Chiranjeevi And AP CM YS Jagan Meet, Chiranjeevi And AP CM YS Jagan Meet Comments, Chiranjeevi And AP CM YS Jagan Meet News, Chiranjeevi Thank AP CM Jagan For Resolving Telugu Film Industry, CPI Narayana, Film Chamber, Film Industry, Film Industry Issues, Latest News Headlines, Mango News, Megastar Chiranjeevi Thank AP CM Jagan For Resolving Telugu Film Industry Problems, Resolving Telugu Film Industry Problems, Telugu Film Industry Problems

సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడినట్లుగా భావిస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈరోజు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం.. టికెట్‌ ధరలు సహా ఇండస్ట్రీకి చెందిన పలు అంశాలపై ప్రధానంగా చర్చించింది. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తోపాటు ప్రభాస్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి వంటి ప్రముఖులు ఈరోజు ఉదయం సీఎం జగన్‌ను కలిశారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడిందని భావిస్తున్నామని ఆయన తెలిపారు.

“ఫిబ్రవరి నెల చివరి వారం నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని 5వ షోకు కూడా సీఎం జగన్ ఆమోదం తెలిపారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన పలు అంశాలపై అందరికీ మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంటానని సీఎం తెలిపారు. ఈ రోజు దేశవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఈక్రమంలోనే.. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రత్యేక వెసులుబాటు ఇవ్వాలని కోరగా, మంత్రుల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అలాగే, విశాఖపట్టణాన్ని షూటింగ్స్ కి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఈ చర్చల విషయంలో మాకు మద్దతు తెలిపిన మంత్రి పేర్ని నానికి కృతఙ్ఞతలు. అలాగే, ఇండస్ట్రీ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ కు సినీ పరిశ్రమ తరపున ధన్యవాదాలు” అని చిరంజీవి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 6 =