నటి హేమకు బిగ్ షాక్ తగిలింది. మే 20న బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు పోలీసులు. వైద్య పరీక్షల్లోనూ ఆమె పాజిటివ్‌గా తేలింది. రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన హేమ జైలు నుంచి బెయిల్ పై బయటకి వచ్చింది. ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.హేమకి డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఊరట లభించినట్లే అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా బెంగళూరు పోలీసులు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు.
రేవ్ పార్టీపై బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. వాసు, అతని స్నేహితులు చిత్తూరు జిల్లాకు చెందిన డెంటిస్ట్ రణధీర్ బాబు, కోరమంగళకు చెందిన అరుణ్ కుమార్, నాగబాబు, మహ్మద్ అబూబకర్, అగస్టిన్ దాదాగా గుర్తింపు పొందిన నైజీరియన్ దేశస్థుడ్ని పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు, డ్రగ్స్ సప్లై చేసినందుకు నిందితులుగా చేర్చారు. కాగా 1086 పేజీల ఛార్జ్ షీట్ ను పోలీసులు దాఖలు చేశారు. పార్టీలో MDMA డ్రగ్ ను హేమ సేవించినట్టు ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు.
పార్టీకి హాజరైన మరో నటికి టెస్టులు చేయగా.. డ్రగ్స్ నెగెటివ్ వచ్చిందని.. ఆమె సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. కాగా రేవ్ పార్టీలో పట్టుబడిని తర్వాత హేమ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని.. హైదరాబాద్‌లో ఉన్నట్లు వీడియో విడదుల చేసింది. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది. అయితే ఆమె మెడికల్ రిపోర్టు పాజిటివ్ అని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆపై ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హేమ… వాసు, అరుణ్‌లకు ఫ్రెండ్. వారు ఆమెను పార్టీకి ఆహ్వానించారని తెలుస్తోంది.