న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌ ‘బెస్ట్ డైరెక్టర్‌’ అవార్డు గెలుచుకున్న ఎస్ఎస్ రాజమౌళి, తొలి భారతీయుడిగా ఘనత

Tollywood Filmmaker SS Rajamouli Wins The Best Director For RRR Movie at New York Film Critics Circle Awards,SS Rajamouli Won New York Film Critics Award,New York Film Critics Circle's Best Director Award,New York Film Critics Best Director Award,SS Rajamouli New York Film Critics Best Director,Mango News,Mango News Telugu,New York Film Critics Circle,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌’ ‘బెస్ట్ డైరెక్టర్‌’గా అవార్డు గెలుచుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి గానూ ఆయనకు ఏ అవార్డు వరించింది. తద్వారా ఈ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడిగా ఎస్ఎస్ రాజమౌళి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆయన స్టీవెన్ స్పీల్‌బర్గ్, డారన్ అరోనోఫ్స్కీ, సారా పోలీ మరియు గినా ప్రిన్స్-బ్లైత్‌వుడ్ వంటి హేమాహేమీ దర్శకులతో పోటీపడి మరీ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. ఇక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో, ‘టోడ్ ఫీల్డ్స్ టార్’ సంవత్సరపు ఉత్తమ చిత్రంగా గెలుపొందింది. ‘కేట్ బ్లాంచెట్’ ఉత్తమ నటిగా ఎంపికవగా, ‘ కోలిన్ ఫారెల్’ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు.

కాగా రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నటులు ‘రామ్ చరణ్’ మరియు ‘జూనియర్ ఎన్టీఆర్’ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర వీరులు కొమురం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లను తీసుకుని దానికి కొంచెం ఫిక్షన్ జోడించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు రాజమౌళి. దీంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే ఈ సినిమాతో రాజమౌళి ఇండియాలో వరుసగా రెండోసారి రూ.1,000 కోట్ల క్లబ్ అందుకున్న ఏకైక దర్శకుడిగా నిలిచాడు. జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర పోషించగా, రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కనిపించాడు. ఇదిలా ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు మరింత దగ్గరైంది ఈ సినిమా.  ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆస్కార్’ బరిలోకి సైతం దిగిన ఈ సినిమా.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి మరియు మరిన్నింటితో సహా అన్ని ప్రధాన విభాగాలలో నామినేషన్ కోసం పోటీ పడుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − three =