సంక్రాంతి పండగ వస్తుందంటే ప్రేక్షకులందరికీ ఒక ఉత్సాహం. ఈసారి ఆ ఎగ్జైట్‌మెంట్‌ను మరింత పెంచడానికి మూడు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్”, బాలకృష్ణ “డాకు మహారాజ్”, వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం” సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇక తమిళంలో, అజిత్ నటించిన “విడాముయార్చి” కూడా విడుదలకావల్సింది.. కానీ విడాముయార్చి వాయిదా పడింది.
తమిళ్ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్‌కు ప్లస్:
విడాముయార్చి వాయిదా పడటంతో తమిళనాడు థియేటర్లలో పెద్ద సినిమా లేదు. ఇది రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” కు అదనపు అవకాశాన్ని తీసుకువస్తోంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం, తమిళ్ స్టార్ SJ సూర్య విలన్‌గా నటించడం సినిమాకు తమిళ్ మార్కెట్‌లో మంచి ఆదరణను తీసుకురానుంది. కాస్త హిట్ టాక్ వచ్చినా, రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.
ట్రైలర్ డేట్ ఫిక్స్:
మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ రేపు, జనవరి 2న సాయంత్రం 5.04 గంటలకు విడుదల కాబోతోంది. అప్డేట్‌గా విడుదలైన సాలిడ్ పోస్టర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ప్రీమియర్స్ వివాదం – తెలుగు ఇండస్ట్రీకి షాక్:
ఇటీవలి పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో జరిగిన దుర్ఘటనలతో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి పర్మిషన్లు ఉండవని తేల్చిచెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల విషయంలో గేమ్ ఛేంజర్‌కు మద్దతు తెలిపే అవకాశముంది.
శంకర్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి-కొడుకులుగా డబుల్ రోల్ చేస్తుండటం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది. కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటించారు. సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అన్ని పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలకానున్న గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాఫ్యాన్స్, కామన్ ఆడియన్స్‌తో పాటు మొత్తం ఇండస్ట్రీ గేమ్ ఛేంజర్ విజయాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.