ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మన దేశంలో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలు దీని బారిన పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలలోని వారికి కూడా కరోనా వైరస్ సోకుతోంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, SS థమన్, లక్ష్మీ మంచు, మీనా, వరలక్ష్మీ శరత్‌కుమార్, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ సహా పలువురు కోవిడ్ బారిన పడ్డారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
“వాక్సిన్ తీసుకోవడం వలన ఈరోజు నేను బావున్నాను. అయినాసరే, కరోనా బారిన పడవలసి వచ్చింది. కరోనా నియమాలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనాకు సంబంధించి అన్ని లక్షణాలు నాకు ఉన్నాయి. అయితే, ఈ వైరస్ నుంచి నేను వేగంగా కోలుకుంటున్నాను. దయచేసి అందరు వాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మళ్లీ టెస్టులు చేయించుకొని ఇంటికి తిరిగి వస్తాననని ఆకాంక్షించారు. నా కోసం ప్రార్దించిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హృదయ పూర్వక ధన్యవాదాలు”.. అని త్రిష ట్వీట్‌లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ