తన పుట్టిన రోజు వేడుకలపై అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు విజ్ఞప్తి

Mahesh Babu, Mahesh Babu Birthday, Mahesh Babu Latest News, Mahesh Babu News, Mahesh Babu Urges Fans to Avoid Social Gatherings, Mahesh Babu Urges Fans to Avoid Social Gatherings on His Birthday, Superstar, Superstar Mahesh Babu, Tollywood News

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఈ రోజు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆగష్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కోరారు. “ప్రియమైన అభిమానులకు, మీరందరూ నాకు తోడుగా ఉండటం నా అదృష్టం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందిరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనందరం చేస్తున్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండటం అనేది అన్నింటికంటే ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని” మహేష్ బాబు ట్వీట్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu