అమెరికాలో కూడా టిక్‌టాక్ నిషేధం, 45 రోజుల్లోగా అమల్లోకి వచ్చేలా ట్రంప్ ఆదేశాలు

Banning US deals with TikTok, TikTok Ban, TikTok set to ban in US, Trump bans US deals with TikTok, Trump issues order effectively banning TikTok, Trump signs orders banning US business with TikTok, US President Trump, US President Trump Signs on Executive Order Banning US deals with TikTok

భారత్‌-చైనా వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌ సహా మొత్తం 59 చైనా ఆధారిత యాప్‌లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా టిక్‌టాక్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. టిక్‌టాక్‌, దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ మరియు వీ చాట్ కంపెనీ టెన్సన్ట్ తో సంబంధాలపై 45 రోజుల్లోగా నిషేధం అమల్లోకి రావాలని డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై గురువారం నాడు ట్రంప్ సంతకం చేశారు.

టిక్‌టాక్‌ మరియు వీ చాట్ కొనుగోలుపై అమెరికన్‌ కంపెనీలు చట్ట పరిధిలో 45 రోజుల లోపలే చర్చలు జరపాలని, ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరపడమైనా నిషిద్ధమని వెల్లడించారు. టిక్‌టాక్‌ యాప్‌ అమెరికాలో 175 మిలియన్లు మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, వ్యక్తిగత, ఇతర సమాచారాలను యాప్ ద్వారా సంగ్రహించి చైనాకు చేరేలా చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. దేశ భద్రత, రక్షణ కోసం టిక్‌టాక్‌ యజమానులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 16 =