సల్లూ భాయ్‌తో అత్యంత సన్నిత సంబంధాలున్న బాబా సిద్ధిఖీని..ఈ నెల 12న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసి కాల్చి చంపింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు షాక్ తగిలినట్లు అయింది. ఆ తర్వాత సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. అప్పటి నుంచి అక్కడ ఎవరూ సెల్ఫీలు కానీ వీడియోలు కానీ తీసుకోకుండా పోలీసులు నిషేధాన్ని విధించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు చుట్టుముట్టారు. కనీసం మీడియా సిబ్బందిని కూడా అనుమతించడం లేదు.
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య జరగడంతో.. సల్మాన్ ఖాన్‌కు భారీగా అదనపు భద్రతను పెంచారు. సల్మాన్ ఖాన్‌ను హత్య చేస్తామంటూ గతంలోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించడంతో.. సల్మాన్ ఖాన్ భద్రతను వై ప్లస్‌కు అప్డేట్ చేశారు. అలాగే ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటన్నటితో పాటు శిక్షణ పొందిన సాయుధ కానిస్టేబుల్ కూడా సల్మాన్ వెంట వెళ్లనున్నాడు.
సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో.. సల్లూ భాయ్ భద్రతను పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా సరే పోలీసుల నిఘాలోనే ఉండవలసి వస్తుంది. సల్మాన్ కు చెందిన పన్వెల్ ఫామ్హౌస్ చుట్టూరా పోలీసులు గట్టి భద్రతను పెంచారు. ఫామ్ హౌస్లోకి వెళ్లి, వచ్చే వారిని పర్యవేక్షించడానికి ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు.