‘మా’ ఎన్నికలు : తన ప్యానెల్ ప్రకటించిన నటుడు మంచు విష్ణు

Actor Manchu Vishnu Announced His Panel, Actor Manchu Vishnu Announced His Panel Today, Actor Vishnu Manchu announces panel, Actor Vishnu Manchu announces panel for polls, Babu Mohan Raghu Babu join Vishnu’s panel, maa association president 2021 maa association president, MAA Elections, MAA Elections 2021, Manchu Vishnu announces his panel for MAA Elections, Manchu Vishnu’s Panel for MAA Elections, Mango News

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10, ఆదివారం నాడు జరగనున్న సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇటీవలే విడుదలైంది. దీంతో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థులు ప్యానెల్ ఏర్పాటు, ప్రచారంపై దృష్టి సారించారు. ఈసారి ‘మా’ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, నటుడు మంచు విష్ణుల మధ్యనే ప్రధాన పోటీ నెలకుంది. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ ఇప్పటికే తన ప్యానెల్ ను ప్రకటించి ప్రచారం ప్రారంభించగా, తాజాగా గురువారం ఉదయం మంచు విష్ణు కూడా తన ప్యానెల్ ను ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, జనరల్‌ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబెర్స్ వివరాలను మంచు విష్ణు విడుదల చేశారు. మరోవైపు అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ ఎన్నికలను నిర్వహించనున్నారు.

మంచు విష్ణు ప్యాన‌ల్‌ :

  • ప్రెసిడెంట్ : మంచు విష్ణు
  • ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ – బాబు మోహన్
  • జనరల్‌ సెక్రటరీ – రఘుబాబు
  • వైస్‌ ప్రెసిడెంట్‌ – మాదాల రవి
  • వైస్‌ ప్రెసిడెంట్‌ – పృథ్వీరాజ్
  • జాయింట్‌ సెక్రటరీ – కరాటే కళ్యాణి
  • జాయింట్‌ సెక్రటరీ – గౌతమ్ రాజు
  • ట్రెజరర్‌ – శివ బాలాజీ

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబెర్స్:

  • అర్చన
  • గీతా సింగ్
  • అశోక్ కుమార్
  • సంపూర్ణేష్ బాబు
  • హరినాథ్ బాబు
  • జయవాణి
  • మలక్ పేట శైలజ
  • మాణిక్
  • పూజిత
  • రాజేశ్వరి రెడ్డి
  • రేఖ
  • శశాంక్
  • శివన్నారాయణ
  • శ్రీలక్ష్మి
  • శ్రీనివాసులు.పి
  • స్వప్న మాధురి
  • విష్ణు బోప్పన్న
  • వడ్లపట్ల ఎం.ఆర్.సీ
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =