దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 20 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,148 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,81,179 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 302 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,12,924 కి పెరిగింది. ఇక దేశంలో కొత్తగా 30,009 కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,22,19,896 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.46 శాతంగానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ప్రస్తుతం 1,48,359 (0.35%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక గత 24 గంటల్లో కేరళ (5023), మహారాష్ట్ర (1151), మిజోరాం (964), రాజస్థాన్ (769), మధ్యప్రదేశ్ (690), కర్ణాటక (667), తమిళనాడు (618), ఢిల్లీ (583), హర్యానా (508), ఉత్తర్ ప్రదేశ్ (465) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద గురువారం ఉదయం 7 గంటల వరకు 176.52 కోట్ల (1,76,52,31,385) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు. అలాగే గత 24 గంటల్లో 30.49 లక్షలకుపైగా (30,49,988) వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ