ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ లో ఉన్న భారతీయులకు సూచనలు జారీ

Indian Embassy in Kyiv Issues Advisory for Indians in Ukraine, Indian Embassy in Kyiv, Indian Embassy Issues Advisory for Indians in Ukraine, Indians in Ukraine, Russia Declares War On Ukraine, President Vladimir Putin Orders For Military Operation, President Vladimir, War On Ukraine, Military Operation, Russian forces attack Ukraine, Russia-Ukraine live news, Russia-Ukraine Latest Updates, Russia-Ukraine Latest news, Russia President Vladimir, Russia President Vladimir Declares War On Ukraine, Ukraine, Russia, Russia Says Destroyed Ukraine Airbases, Russia Says Destroyed Ukraine Air Defences, Russia-Ukraine War News, Russia-Ukraine War Live News, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌ పై గురువారం నాడు రష్యా సైనిక చర్యను (మిలిటరీ ఆపరేషన్) ప్రకటించించడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం నాడు కీలక సూచనలు జారీ చేసింది. ఉక్రెయిన్‌ లో ఉన్న భారతీయులను ప్రశాంతంగా ఉండాలని మరియు వారు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని కోరింది.

“ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి చాలా అనిశ్చితంగా ఉంది. దయచేసి మీరు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండండి మరియు సురక్షితంగా ఉండండి, అది మీ ఇళ్లలో, హాస్టళ్లలో, వసతి లేదా రవాణాలో కావచ్చు. అలాగే కైవ్‌కు ప్రయాణిస్తున్న వారందరూ, కైవ్‌లోని పశ్చిమ ప్రాంతాల నుండి ప్రయాణించే వారితో సహా, తాత్కాలికంగా వారి వారి నగరాలకు తిరిగి వెళ్ళండి. ఇతర ఏవైనా అప్‌డేట్‌ల కోసం తదుపరి సలహాలు జారీ చేయబడతాయి” అని భారతీయ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు రష్యా సైనిక చర్యను ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. రష్యాకు చెందిన 5 యుద్ధవిమానాలు, ఒక హెలికాఫ్టర్ ను కూల్చివేసినట్టు ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =