దేశంలో అదుపులోనే కరోనా వ్యాప్తి, కొత్తగా 5,664 పాజిటివ్ కేసులు నమోదు

India Covid-19 Positive Cases Update on September 18th, India Records 5664 New Covid Cases, 33 Covid Deaths September 18th, Mango News, Mango News Telugu, India Logs 5664 Covid Positive Cases, 5664 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 6 వేలలోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 5,664 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 18, ఆదివారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,45,34,188 కు, మరణాల సంఖ్య 5,28,337 కి పెరిగిందని తెలిపారు.

అలాగే గత 24 గంటల వ్యవధిలో 4,555 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,39,57,929 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 47,922 (0.11%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 2,89,228 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 89.15 కోట్లు దాటింది. రోజువారీ పాజీటివిటీ రేటు 1.96 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 1.79 శాతంగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 9 =