దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. జూన్ 26, శుక్రవారం నాడు కొత్తగా 3645 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా చెన్నై నగరంలో 1956 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74,622 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 49690 కేసులు నిర్ధారణ అయ్యాయి.
గత 24 గంటల్లో నమోదైన 46 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 957 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1358 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 41357 కి చేరింది. ప్రస్తుతం 32305 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జూన్ 19 నుండి తమిళనాడులోని పలు జిల్లాలలో లాక్ డౌన్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu