5వ టెస్టులో ఇండియాపై ఇంగ్లండ్ ఘన విజయం.. సెంచరీలతో చెలరేగిన రూట్, బెయిర్‌స్టో, 2-2తో సిరీస్ సమం

Ind vs Eng 5th Test Highlights England Won The Match Greatest Ever Chase in It's Test-Cricket To Level Series, England Won The Match Greatest Ever Chase in It's Test-Cricket To Level Series, Ind vs Eng 5th Test Highlights, India vs England 5th Test, England beat India by 7 wickets, New England vindicates Bazball, India vs England 5th Test Highlights, England Won The Match Greatest Ever Chase in It's Test-Cricket, A Test match of the highest class culminates with England achieving a record chase, ENG vs IND 5th Test Day 5 Highlights, 5th Test Highlights, India, England, Ind vs Eng 5th Test News, Ind vs Eng 5th Test Latest News, Ind vs Eng 5th Test Latest Updates, Ind vs Eng 5th Test Live Updates, Mango News, Mango News Telugu,

భారత్ క్రికెట్ అభిమానులు భయపడినట్లే జరిగింది. నిన్నటివరకూ చేతిలో ఉందనుకున్న మ్యాచ్ చేజారింది. ఎడ్డ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌తో జరిగిన రీషెడ్యూల్డ్‌ ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియా తన ముందుంచిన భారీ స్కోరుని ఛేజ్ చేయడం ద్వారా కీలక మ్యాచ్‌ను గెలుచుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సిరీస్ సమం చేసింది. గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్‌ రెండు, ఇంగ్లండ్‌ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా.. మరో మ్యాచ్‌ డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక తాజా మ్యాచ్ విషయానికొస్తే.. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌, కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ చేధించింది.

ఓవర్‌నైట్ స్కోరు 259/3తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో వికెట్ పడకుండానే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జో రూట్‌ (142), జానీ బెయిర్‌స్టో (114) అద్భుత సెంచరీలతో ఇంగ్లాండ్ జట్టుకి ఘనవిజయం అందించారు. తొలి మూడు రోజులు మ్యాచ్ లో ఆధిపత్యం చూపించిన భారత్.. ఆ తర్వాత మాత్రం క్రమంగా ఓటమి అంచుల్లోకి జారుకుంది. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్ లో వికెట్లు తీయడంలో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. జో రూట్, జానీ బెయిర్‌స్టో జోడీని విడదీయలేకపోయారు. ఫలితంగా వీరిద్దరూ సెంచరీలు సాధించడమే కాకుండా ఇంగ్లండ్ జట్టు 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here