దేశంలో కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. బుధవారం సాయంత్రానికి ఈ కేసుల సంఖ్య 73 కి చేరుకునట్టుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారందరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే గదిలో ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. వారి ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులను కూడా క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నామన్నారు. సహ ప్రయాణికులు, కుటుంబ సభ్యులు మరియు ఇతరుల కోసం సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఇతర నమూనాలపై కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోందని చెప్పారు.
కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ వివరాలు (ఇన్స్టిట్యూట్/ ల్యాబ్) :
- ఎన్‌సీడీసీ ఢిల్లీ – 8
- ఐజీఐబీ ఢిల్లీ – 20
- ఎన్‌ఐబిఎంజి కళ్యాణి కోల్‌కతా – 1
- ఎన్‌ఐవీ పూణే – 30
- సీసీఎంబీ హైదరాబాద్ – 3
- ఎన్ఐఎంహెఛ్ఏఎన్ఎస్ బెంగళూరు – 11
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ