బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ అప్రమత్తం

Bird Flu, Bird Flu Cases, bird flu in Bengaluru, Bird Flu Outbreak, Centre confirms bird flu, Centre Confirms Bird Flu Cases, Centre confirms bird flu outbreak, Centre Confirms Outbreak Of Bird Flu, Mango News Telugu, Measures to Prevent Bird Flu, Outbreak Of Bird Flu, Telangana Forest Department, Telangana Forest Department Measures to Prevent Bird Flu, Telangana Measures to Prevent Bird Flu

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాల సీఎస్ లకు వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ లేఖ రాశారు. కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులను పీసీసీఏఫ్ ఆర్.శోభ అప్రమత్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా పక్షులు చనిపోతున్నాయి. ఇందులో వలసపక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసీఏఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీసెస్, భోపాల్ లో పరీక్షిస్తే హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు కేంద్రం నిర్ధారించింది.

తాజా పరిస్థితుల్లో ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. పక్షులను పూర్తి స్థాయిలో పెంచడంతో పాటు నిఘా ఉంచాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ కూడా అప్రమత్తం అయ్యింది. కేంద్రం ఆదేశాల మేరకు చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులకు పీసీసీఏఫ్ ఆర్.శోభ సమాచారం ఇచ్చారు. జూ పార్క్ లతో పాటు, అటవీ ప్రాంతంలో ఏవైనా అసహజ మరణాలు ఉంటే నమోదు చేయాలని, తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ఈ సీజన్ లో వలస పక్షుల సంచారం వుంటుందని వాటిని కూడా పర్యవేక్షించాలని తెలిపారు. ఎవరికైనా సంబంధించిన సమాచారం ఉంటే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు 18004255364 ఫోన్ చేయాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 5 =