రాజ్‌భవన్‌లో 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్, క్వారంటైన్ కు తరలింపు

84 of Tamil Nadu Raj Bhavan Staff Tested Positive, Coronavirus in Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu Corona Cases, Tamil Nadu Corona Deaths, Tamil Nadu Corona Positive Cases, Tamil Nadu Coronavirus, Tamil Nadu News, Tamil Nadu Raj Bhavan, Tamil Nadu Raj Bhavan Staff Tested Positive

దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఆ రాష్ట్ర రాజ్‌భవన్‌ పై కూడా పడింది. రాజ్ భవన్ లో కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడంతో మొత్తం 147 మందికి పరీక్షలు నిర్వహించగా, 84 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిలో సెక్యూరిటీ, ఫైర్‌ సిబ్బంది ఉన్నారు. వీరంతా మెయిన్ గేట్ వద్ద, బిల్డింగ్ బయట విధులు నిర్వహిస్తుంటారని, గవర్నర్ తో కానీ, ఇతర ఉన్నతాధికారులతో కానీ వీరు సన్నిహితంగా వచ్చిన సందర్భాలు లేవని వెల్లడించారు.హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వీరందరిని క్వారంటైన్ కు తరలించామని చెప్పారు. మరోవైపు జూలై 22, బుధవారం నాటికే తమిళనాడు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,492 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 89,561 కేసులు నిర్ధారణ అయ్యాయి.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu