ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఆయన చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతోనే ఆయనను ఆసుపత్రికిలో చేర్పించారని మీడియాలో వార్తలు రాగా డీఎండీకే పార్టీ ఒక ప్రకటనలో ఖండించింది. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం విజయకాంత్ ను ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ పేర్కొంది. ఆయన ఆరోగ్యం మంచిగానే ఉన్నందున ఎలాంటి పుకార్లను నమ్మవద్దని పార్టీ సభ్యులను, కార్యకర్తలను, అభిమానులను కోరింది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు కెప్టెన్ విజయకాంత్ గత అక్టోబర్ లో కరోనా బారినపడి, చికిత్స అనంతరం కోలుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ








































