శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా సెట్స్‌లో ఫిబ్రవరి 19న జరిగిన ఘోర ప్రమాదంలో కృష్ణ (అసిస్టెంట్ డైరెక్టర్), చంద్రన్ (ఆర్ట్ అసిస్టెంట్), మధు (ప్రొడక్షన్ అసిస్టెంట్) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చిత్రయూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే అభియోగాలతో క్రేన్ ఆపరేటర్, కాంట్రాక్టర్, సినిమా ప్రొడక్షన్ మేనేజరు, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌లపై పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణలో భాగంగా మార్చ్ 3, మంగళవారం నాడు నటుడు కమల్‌హాసన్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ప్రమాద ఘటనపై కమల్‌హాసన్ ను చైన్నై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఇదే ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి సమన్లు అందడంతో చిత్ర దర్శకుడు శంకర్ కూడా ఫిబ్రవరి 28న పోలీసుల ఎదుట విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.
[subscribe]





















































