సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

Mango News Telugu, Modi Quit Social Media, Modi Twitter, Narendra Modi, PM, PM Modi, PM Modi Give up Social Media Accounts, PM Modi Social Media Accounts, pm narendra modi, Prime Minister Narendra Modi
ప్రధాని నరేంద్ర మోడీ మార్చ్ 2, సోమవారం నాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం నుంచి ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ ఛానెళ్లనుంచి వైదొలుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో ప్రకటించారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్లో 5 కోట్ల 33 లక్షల మంది, ఫేస్‌బుక్ లో 4 కోట్ల 47 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌ లో 3 కోట్ల 52 లక్షల మంది, యూట్యూబ్ ఛానెల్లో 40 లక్షల 52 వేల మందికి పైగా మోదీని అనుసరిస్తున్నారు. అన్ని సోషల్ మీడియా అకౌంట్లను కలుపుకుంటే 15 కోట్ల మందికి పైగా మోదీని ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నుంచి మోదీ ఎందుకు వైదొలగాలనుకున్నారో ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. మరోవైపు మోదీ నిర్ణయంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు.

 

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 5 =