కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ 4.0 లో ప్రార్ధనా మందిరాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. అయితే మే 31న లాక్‌డౌన్ 4.O ముగియనున్న నేపథ్యంలో జూన్ 1 వ తేదీ నుంచి రాష్ట్రంలో దేవాలయాలు సహా అన్ని రకాల ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 1 నుంచి దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు సహా అన్ని ప్రార్థనా మందిరాలు తెరవవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
అయితే ప్రార్ధనా మందిరాలు తెరిచినప్పటికీ ఒకేసారిగా 10 మందికన్నా ఎక్కువ మంది ప్రవేశించేందుకు అనుమతి ఉండదని ఆమె స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులతో నడిపించవచ్చని ఆమె తెలిపారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని, కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారివల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu