అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది.. నవంబర్ నెలలో యునైటెడ్ స్టేట్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన సమకాలీన రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ నుంచి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తలపడుతున్నారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కమల ముందంజలో ఉన్నారు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలో కమలా హ్యారిస్ భర్త డగ్లస్ ఎంహాఫ్ కు సంబంధించి బ్రిటన్ పత్రిక ‘ది డెయిలీ మెయిల్’ సంచలన కథనం వెలువరించింది.
2014 సంవత్సరంలో కమలా హ్యారిస్‌తో డగ్లస్ ఎంహాఫ్‌కు పెళ్లి జరిగింది. అయితే మొదటి భార్య ఉన్న టైంలోనే ఒక యువతితో తనకు వివాహేతర సంబంధం ఉండేదని స్వయంగా డగ్లస్ ఎంహాఫ్ చెప్పారంటూ సదరు బ్రిటన్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. తన మొదటి భార్య పిల్లలు చదువుకునే స్కూలులో టీచర్‌గా పనిచేసే ఆ యువతితో తాను సంబంధం నెరిపానని డగ్లస్ చెప్పినట్లు కథనంలో ప్రస్తావించారు.
ఆమె గర్భం కూడా దాల్చిందని, అయితే వెంటనే గర్భస్రావం చేయించుకుందని బ్రిటన్ పత్రిక న్యూస్ స్టోరీలో పేర్కొన్నారు. ‘‘నాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కారు పార్కింగ్ పనులు చేసే ఓ యువకుడితో ఆమె సరసాలాడటం మొదలుపెట్టింది. దీంతో నాకు కోపం వచ్చి ఆమెను చెంపదెబ్బ కొట్టాను’’ అని స్వయంగా డగ్లస్ ఎంహాఫ్ చెప్పారని కథనంలో పేర్కొన్నారు. కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో ఆమె భర్తపై వెలువడిన ఈ కథనం అమెరికాలో రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అయితే.. ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా సాగుతుండటం.. అటు అగ్రరాజ్యంతో పాటు.. ఇటు భారత్ తోపాటు పలు దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.. కారణం ఏమిటంటే.. భారత సంతతికి చెందిన కమలా హారిస్ దూకుడు ప్రదర్శిస్తుండటం.. డెమొక్రాటిక్ అభ్యర్ధిగా కమలాను ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకూ ముందంజ వేసిన రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెనకబడ్డారు.
వాస్తవానికి ప్రెసిడెంట్ రేసులోకి వచ్చాక.. కమలా హారిస్ టాక్ ఆఫ్ ది అమెరికన్ పాలిటిక్స్‌గా మారిపోయారు. అయితే ఆమెపై నాన్‌లోకల్ ముద్ర వేసేందుకు కుట్ర జరుగుతుండటం సంచలనంగా మారింది. అమెరికా రాజ్యాంగంలోని చిన్న లూప్‌హోల్‌తో హరిస్ అభ్యర్థిత్వమే చెల్లదంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో కమలాకే మొగ్గు ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇలా ఎన్నికల వేడి పీక్స్‌కు చేసిన టైమ్‌లో.. కమలా హారిస్ నాన్ లోకల్ అనే వాదన, ఆమే భర్త డగ్ రెండు పెళ్లిళ్ల అంశం తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.