జంతువులపై సత్ఫలితాలు ఇస్తున్న “కొవాగ్జిన్” : భారత్‌ బయోటెక్‌

Animal Trials of Covaxin Successful, Bharat Biotech, Bharat Biotech Covaxin, Bharat Biotech Covaxin Vaccine, Bharat Biotech Covid-19 Vaccine, Coronavirus Vaccine COVAXIN, Coronavirus Vaccine Covaxin Clinical Trials, COVAXIN, Covaxin Clinical Trials, Covaxin Vaccine, Hyderabad Company Bharat Biotech, ICMR’s COVID-19 vaccine COVAXIN

కరోనా వ్యాక్సిన్‌ “కొవాగ్జిన్” తయారీలో భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జంతువులపై సత్పలితాలను ఇస్తున్నాయని శుక్రవారం నాడు భారత్‌ బయోటెక్ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగినట్టుగా ఫలితాల్లో వెల్లడైనట్టు పేర్కొన్నారు. రెండో డోస్‌ వ్యాక్సిన్ ఇచ్చాక 14 రోజుల తర్వాత చేసిన పరిశీలనలో, యాంటీబాడీలను తటస్థం చేయడంతో పాటుగా జంతువుల ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ వృద్ధిని వ్యాక్సిన్ నియంత్రించినట్లు గుర్తించామని తెలిపారు. అలాగే వ్యాక్సిన్ వలన రోగ నిరోధక శక్తి పొందిన జంతువులలో ఎలాంటి ప్రతికూల ప్రభావం నమోదు కాలేదని పేర్కొన్నారు.

దేశంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఫేజ్-1 క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం కావడంతో, భారత్‌ బయోటెక్‌ సంస్థ ఇటీవలే రెండోదశ ట్రయల్స్‌‌ ను కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా కొవాగ్జిన్ వ్యాక్సిన్ జంతువులపై మంచి ఫలితాలను ఇవ్వడంతో భారత్‌ బయోటెక్ మరో ముందడుగు వేసినట్టయింది. భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సంయుక్తంగా కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారుచేస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu